రేపు శనివారం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పూజలు.
రేపు శనివారం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పూజలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు శనివారం సెప్టెంబర్ 28వ తేదీనాడు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారి ఆధ్వర్యంలో యల్లంపల్లె శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం లో పూజలు నిర్వహణ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు పట్టణ అధ్యక్షుడు కేశా లింగన్న ఓ ప్రకటన లో తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుమలను తిరుమలలో లడ్డును వెంకటేశ్వర స్వామి పవిత్రతను విశిష్టతను అపవిత్రం చేసినందుకు తిరుమలనాథ స్వామి దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొనవలసినదిగా ఆయన కోరారు. ప్రొద్దుటూరు రోడ్డు SCCR కల్యాణ మండపం దగ్గరికి ఉదయం 8 గంటల కు రావాలని, అక్కడ నుంచి మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తిరుమల నాథ్ స్వామి దగ్గరికి చేరుకొంటామని వివరించారు.
